: రియాలిటీ షోలో ఆప్ నేత!


మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై పోటీ చేసి, పరాజయం పాలైన ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ త్వరలో బుల్లితెర సెలబ్రిటీగా మారబోతున్నారు. కవి నుంచి రాజకీయ నేతగా మారిన విశ్వాస్ 'బిగ్ బాస్' రియాలిటీ షోలో పాల్గొనబోతున్నారని సమాచారం. ఈ మేరకు సదరు ప్రొడక్షన్ సంస్థ ఎండోమోల్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనాలంటూ సంప్రదించింది. ఇందుకుగానూ రూ.5 కోట్లు ఆఫర్ చేసిందని సమాచారం. ఈ కార్యక్రమంలో తాను పాల్గొంటున్నట్టు కుమార్ విశ్వాస్ కూడా ధృవీకరించారు. సెప్టెంబర్ నుంచి మొదలవబోయే బిగ్ బాస్ షోలో తాను పాల్గొనబోతున్నట్లు ఆయన వెల్లడించారు. మిగతా వివరాలు చెప్పేందుకు మాత్రం నిరాకరించారు.

  • Loading...

More Telugu News