: సానియాను చూసి తెలంగాణ గర్విస్తోంది: కేసీఆర్


తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసడర్ గా టెన్నిస్ తార సానియా మీర్జా (27) ను నియమించారు. ఇకపై ఆమె తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు భారత్ లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ప్రచారం కల్పిస్తారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆమెకు నియామక పత్రంతో పాటు కోటి రూపాయల చెక్ కూడా అందించారు. కేసీఆర్ నేడు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన సందర్భంగా సానియా నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, సానియాను చూసి తెలంగాణ గర్విస్తోందని అన్నారు. ప్రస్తుతం మహిళల డబుల్స్ ర్యాంకుల్లో ఐదో స్థానంలో ఉన్న ఆమె అంతర్జాతీయ ర్యాంకుల్లో నెంబర్ వన్ గా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News