: న్యాయమూర్తుల నియామక విధానంలో మార్పు అవసరం: కేంద్ర సర్కార్


అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ జిల్లా జడ్జిని యూపీఏ హయాంలో మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జిగా నియమించేందుకు డీఎంకే నేత సాయం చేశారంటూ తాజాగా భారతీయ ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మర్కండేయ కట్జూ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో న్యాయవ్యవస్థలో అవినీతి చరిత్ర ఉన్న వారిని మిగతా వారు కూడా ప్రోత్సహించారని కూడా చెప్పారు. దీనిపై పార్లమెంటు ఉభయసభల్లో డీఎంకే ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వం మాత్ర కట్జూ చేసిన వ్యాఖ్యలను సమర్థించింది. న్యాయమూర్తుల నియామక విధానంలో మార్పు అవసరమని పేర్కొంది. ఈ మేరకు రాజ్యసభలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ రోజు మాట్లాడుతూ, 2005, జులై 16న అతనిని (జడ్జి) పొడిగించేందుకు కొలీజియం కూడా పరిగణించినట్లు ఓ నోట్ చెబుతోందన్నారు.

  • Loading...

More Telugu News