: రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం ఇంకా కాలయాపన చేస్తోంది: ఎమ్మెల్యే రోజా


ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీపై జాప్యం జరుగుతోందని చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనలో ఇంకా స్పష్టత లేదన్నారు. రైతులను మభ్యపెట్టేందుకే కమిటీ వేశారని విమర్శించారు. కాలయాపనతో కొంతమందికి మాఫీచేసి మిగతావారిని వదిలేయాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అసలు మేనిఫెస్టోలో ఏ రోజు నుంచి ఎప్పటివరకు మాఫీ చేస్తారో కూడా చెప్పలేదన్నారు. కేవలం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వల్లే టీడీపీ గెలిచిందని రోజా ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News