: టీవీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అనుమానాస్పద మృతి
దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ లో మిలితా మండల్ అనే మహిళా టీవీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆమె గతంలో రాజ్యసభ టీవీ చానల్లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా విధులు నిర్వర్తించారు. అంతకుముందు ఎన్డీటీవీలో పనిచేశారు. కాగా, గతరాత్రి ఆమె తన అపార్ట్ మెంట్ వద్ద చనిపోయి ఉండగా కనుగొన్నారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే, రెండో ఫ్లోర్ బాల్కనీ నుంచి పడిపోవడంతో ఆమె మరణించి ఉంటారని ప్రాథమిక సమాచారం.