: వైసీపీ కార్యకర్తలపై వేటకొడవళ్లు, గొడ్డళ్లతో ప్రత్యర్థుల దాడి
అనంతపురం, గుంటూరు జిల్లాల్లో వైసీపీ కార్యకర్తలపై ప్రత్యర్థులు దాడిచేశారు. గుంటూరు జిల్లాలోని రెంటచింతల మండలం మంచికల్లులో వైసీపీ కార్యకర్త నాగిరెడ్డిపై ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడి చేశారు. శతృవులు గొడ్డళ్లతో నరకడంతో నాగిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే అనంతపురం జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. జిల్లాలోని తాడిపత్రి మండలం కొండేపల్లిలో వైకాపా కార్యకర్త రంగయ్య నాయుడును ప్రత్యర్థులు కొడవళ్లతో నరికి హత్య చేశారు. ఒకేరోజు తమ కార్యకర్తలపై రెండు దాడులు జరగడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.