: గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు


ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మేరకు అతనికి బెయిల్ నిరాకరించింది. తదుపరి విచారణను కోర్టు మూడు నెలల వరకు వాయిదా వేసింది. అయితే, గాలి కేసుల విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని దిగువ కోర్టును సుప్రీం ఆదేశించింది. అటు విచారణ ముగిశాక బెయిల్ పిటిషన్ వేయాలని గాలికి తెలిపింది. ప్రస్తుతం ఆయన రిమాండులో ఉంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News