: అమెరికన్ వేతన జీవులకు దాపరికం జాస్తి
అమెరికాలో ఉండే ఉద్యోగులు ఎక్కువ దాపరికాన్ని పాటిస్తున్నారు. తమ వ్యక్తిగత వివరాలు ప్రధానంగా జీతం, బోనస్, ఇంక్రిమెంట్లు వంటి విషయాలను ఇతరులతో షేర్ చేసుకోవడం వారికి ఎంత మాత్రమూ ఇష్టం ఉండదు. ఇదే విషయంలో ఇతర దేశాల్లో బతుకుతున్న వేతన జీవులు కొంచెం మెరుగ్గా ఉన్నారు.
న్యూయార్క్‌లోని ఒక ఎంప్లాయిమెంట్ వెబ్‌సైట్ ఆనలైన్ సర్వే నిర్వహించింది. దాదాపు మూడువేల మందికి పైగా శాంపిల్స్‌నుంచి వివరాలు సేకరించారు. అమెరికాలో తమ జీతం గురించి కొలీగ్స్‌తో చర్చించడానికి కూడా ఉద్యోగులకు ఆసక్తి ఉండడం లేదుట. ఉత్తర అమెరికాలో ఇలాంటి వారు ఇంకా ఎక్కువట. అదే సమయంలో బ్రిటన్‌లో మాత్రం పరిస్థితి కాస్త మెరుగు. జర్మనీ ఉద్యోగులు మాత్రం ఈ విషయంలో బెస్ట్ అని ఈ వెబ్‌సైట్ తేలుస్తోంది. కొలీగ్స్‌తో కేవలం జీతమే కాదు.. సెలవులు, ఆరోగ్య సమస్యలు లాంటి అనేక వివరాల్ని వాళ్లు యథేచ్ఛగా మాట్లాడుకుంటూ ఉంటారట.