: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తమ్ముడినని చెప్పి నయవంచన!


ఓ వ్యక్తి తాను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తమ్ముడినని చెప్పి మహిళా జూనియర్ ఆర్టిస్టును మోసం చేశాడు. సికింద్రాబాద్ కు చెందిన విజయ్ కుమార్ మాగంటి గోపీనాథ్ కార్యాలయం వద్ద తిరుగుతూ, తాను ఎమ్మెల్యే సోదరుడినని చెప్పుకుంటూ అందరినీ నమ్మించాడు. ఈ క్రమంలో శ్రీకృష్ణనగర్లో ఉండే లక్ష్మి అనే జూనియర్ ఆర్టిస్టుతో పరిచయం పెంచుకున్నాడు. ఎమ్మెల్యేతో చెప్పి సినిమా అవకాశాలు ఇప్పించాలని లక్ష్మి కోరింది. ఈ క్రమంలో ఆమె నుంచి రూ.40 వేలు తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా సినిమా చాన్సులు రాకపోవడంతో ఆమె మాగంటి కార్యాలయం వద్ద వాకబు చేసింది. తనకు తమ్ముడెవరూ లేరని ఎమ్మెల్యే చెప్పడంతో తాను మోసపోయినట్టు గ్రహించింది. ఎమ్మెల్యే సూచనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. నిందితుడు విజయ్ కుమార్ కోసం గాలింపు జరుగుతోంది.

  • Loading...

More Telugu News