: అంతర్జాతీయ ఒత్తిళ్ళకు తలొగ్గిన ఉక్రెయిన్ వేర్పాటువాదులు
మలేసియా విమానప్రమాదం అనంతరం ఉక్రెయిన్ తిరుగుబాటుదారుల తీరుపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ రష్యా అనుకూల తిరుగుబాటుదారులు విమాన ప్రయాణికుల మృతదేహాలను, విమాన బ్లాక్ బాక్స్ లను సైతం స్వాధీనం చేసుకుని అట్టిపెట్టుకోవడంపై అమెరికా సహా యూరోపియన్ దేశాలు గర్హించాయి. దీంతో, సర్వత్ర ఒత్తిళ్ళు ఎక్కువైన నేపథ్యంలో రెబల్స్ ఆ మృతదేహాలను, బ్లాక్స్ బాక్స్ లను భద్రపరిచిన రైలును దర్యాప్తు బృందానికి అప్పగించారు. తిరుగుబాటుదారులు ప్రమాదానికి సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేసేందుకు యత్నిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆరోపించిన నేపథ్యంలో ఈ రైలు అప్పగింత చోటుచేసుకుంది.