: అనంతలో పడగవిప్పిన ఫ్యాక్షన్, వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి


అనంతపురం జిల్లాలో మరోమారు ఫ్యాక్షన్ గొడవలు చెలరేగాయి. జిల్లాలోని తాడిపత్రి మండలం కొండేపల్లి గ్రామంలో జరిగిన గొడవల్లో వైఎస్సార్సీపీ కార్యకర్త రంగయ్యనాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. టీడీపీకి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రంగయ్యనాయుడిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రంగయ్యనాయుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News