: భలే గెలిచారు...శభాష్ టీమిండియా: మోడీ అభినందనలు
లార్డ్స్ టెస్టులో చిరస్మరణీయ విజయం సాధించిన టీమిండియాపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో ప్రశంసలజల్లు కురిపించారు. భారత్ అద్భుతమైన విజయం సాధించిందని మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. "టీమిండియా అద్భుత విజయం సాధించింది. మీ స్ఫూర్తి దాయక విజయం చూసి దేశం గర్విస్తోంది. ప్రతి భారతీయుడు సంతోషించదగ్గ విజయమిది" అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.