: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జా
తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను నియమించిందని సమాచారం. ఈ నియామకాన్ని రేపు అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. గుజరాత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్ బచ్చన్ వ్యవహరించినట్టు తెలంగాణ రాష్ట్రానికి సానియా మీర్జా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు.