: హృతిక్ రోషన్ పెద్దమనసుకు నిదర్శనం
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన గొప్పదనాన్ని మరోసారి చాటుకున్నారు. వితరణ కార్యక్రమాల్లో ముందుండే హృతిక్ గత శుక్రవారం ముంబైలోని సబర్బన్ అంధేరీలోని లోటస్ బిజినెస్ పార్క్ లోని 22 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ప్రమాదంలోని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూ మరణించిన నితిన్ యెవ్లేకర్ కుటుంబానికి హృతిక్ రోషన్ 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించినట్టు సమాచారం. ఆ భవనంలో హృతిక్ రోషన్ కుటుంబానికి ఐదు ఫ్లోర్లు ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు ఇతరులకు సహాయపడడం చాలా ముఖ్యమని హృతిక్ పేర్కొన్నారు. మానవతా దృక్పధంతో కుటుంబాన్ని ఆదుకోవడం ప్రధానం అని ఆయన ప్రకటనలో తెలిపారు.