: తిరుమలలో అగ్ని ప్రమాదం.. ఆగిన అన్నదానం


తిరుమలలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ తెల్లవారుజామున అన్నప్రసాద సముదాయంలోని గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదు. భారీగా పొగలు కమ్ముకోవడంతో లోపలికి వెళ్లలేకపోతున్నారు. దీంతో అక్టోపస్ బృందాలు రంగంలోకి దిగాయి. గోదాంలో భారీగా వస్తువులు నిల్వ చేసి ఉండడంతో మంటలు ఎగసిపడుతున్నాయి. టిటిడి చైర్మన్ బాపిరాజు, ఈవో సుబ్రమణ్యం అక్కడకు చేరుకుని పరిస్థతిని సమీక్షిస్తున్నారు. ప్రమాదం కారణంగా ఈ రోజు మధ్యాహ్నం వరకు అన్నదానాన్ని నిలిపివేస్తున్నట్లు జేఈవో శ్రీనివాసరాజు ప్రకటించారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణంగా భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News