: తెలుగులోనే ప్రభుత్వ కార్యకలాపాలు: రాజయ్య
ఇకపై తెలుగులోనే తెలంగాణ ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించనున్నామని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దళిత, గిరిజన, మైనారిటీల సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఫాస్ట్ పథకం ద్వారా విద్యార్థుల ఫీజు చెల్లిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెచ్చించే ప్రతి పైసా క్షేత్రస్థాయికి చేరేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి నియోజవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన చెప్పారు.