: నేను ఇంగ్లిష్ కౌంటీలు ఆడేందుకు సిద్ధం కాలేదు: గ్రేమ్ స్మిత్


ఇంగ్లిష్ కౌంటీలో ఆడటానికి సిద్ధంగా లేనని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ తెలిపాడు. గత ఏడాది మేలో స్మిత్ మోకాలు చిట్లింది. దీంతో ఆయన క్రికెట్ కు దూరమయ్యాడు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న స్మిత్ ను క్రికెట్ కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో సర్రే కౌంటీ జట్టుకు ఆడాల్సిందిగా పిలుపు వచ్చింది. దీంతో "నేను రానున్న ఇంగ్లిష్ లీగ్ లో ఆడలేను. నా గాయం పూర్తిగా నయం కాలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సర్రేకు ధన్యవాదాలు. ప్రస్తుతం నా పాత్ర సమర్ధవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా లేను" అని తెలిపాడు. ఇంగ్లిష్ కౌంటీల్లో సర్రే స్టింట్ జట్టుతో మూడు సంవత్సరాల ఒప్పందం చేసుకున్నాడు. కౌంటీతో ఒప్పందం కుదుర్చుకున్నా క్రికెట్ కు దూరంగా ఉండడం దురదృష్టమని గ్రేమ్ స్మిత్ ఆవేదన వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News