: తీహార్ జైల్లో జంతువులకంటే అధ్వానంగా చూస్తున్నారు: భత్కల్


ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ పలు పేలుళ్ల కేసులో ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో రిమాండులో ఉన్నాడు. ఈ రోజు కోర్టులో హాజరుపర్చిన సమయంలో జైల్లో దీనావస్థపై చెబుతూ, జంతువుకంటే హీనంగా చూస్తున్నారని అన్నాడు. పవిత్ర రంజాన్ మాసంలో సరైన ఆహారం కూడా పెట్టడం లేదని ఈ మేరకు తను రాసిన దరఖాస్తులో పేర్కొన్నాడు. ఇప్పుడు తనను హై సెక్యూరిటీ ఉన్న జైల్ నంబర్ 2లో ఒక్కడినే నిర్బంధించారని తెలిపాడు. తాను ఉంటున్న సెల్ నుంచి జైలు ప్రాంగణంలోకి వెళ్లేందుకు కూడా అనుమతించడం లేదని వాపోయాడు.

  • Loading...

More Telugu News