: పశ్చిమబెంగాల్లో బీజేపీ రెండు సీట్లకు మించి ఎన్నడూ గెలవలేదు: మమతా బెనర్జీ
గత లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీకి రెండు స్థానాలు వచ్చాయని... భవిష్యత్తులో కూడా ఆ పార్టీ ఈ సంఖ్యకే పరిమితమవుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. మూడు సీట్లు గెలుచుకోవడం కూడా ఆ పార్టీకి సాధ్యం కాదని చెప్పారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన మోడీ నెలరోజుల్లోనే రైల్వే, పెట్రోల్ ధరలను పెంచేశారని విమర్శించారు. ఇకపై మోడీని ప్రజలు నమ్మరని అన్నారు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ లో బీజేపీకి చరమగీతం పలికినట్టేనని చెప్పారు.