: సినీ పరిశ్రమకు కేంద్రంగా విశాఖ: గంటా
సినీ పరిశ్రమకు విశాఖ కేంద్ర బిందువుగా మారేలా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ విశాఖలో ఏర్పాటు చేసిన వర్క్ షాపును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్టణం ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా, ఆసియాలోనే గొప్ప నగరంగా ఆవిర్భవించనుందని అన్నారు. సినిమాల షూటింగ్ లకు అనుమతులు, హోటల్ ఛార్జీల్లో డిస్కౌంట్లు తదితర విషయాలపై దృష్టి పెడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.