: 500 దాటిన గాజా మృతుల సంఖ్య
పాలస్తీనాలోని గాజా రక్తమోడుతోంది. ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ సంస్థకు చెందిన దళాల మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 500 దాటిందని అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తున్నాయి. ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న ఈజిప్టుకు తాము మద్దతు తెలుపుతామని అమెరికా ప్రకటించింది. అదేవిధంగా ఇరుపక్షాలు కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రతామండలి కోరింది.