: ప్రజాప్రతినిధిగా దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కుంది: అక్బరుద్దీన్


మహారాష్ట్రలోని థానే పోలీస్ కమిషనర్ ఇచ్చిన నోటీసుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఓ ప్రజాప్రతినిధిగా తనకు దేశంలోని ఏ ప్రాంతానికైనా స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉందన్నారు. మహారాష్ట్రలో బలోపేతం అవుతున్న ఎంఐఎం పార్టీని అడ్డుకునేందుకే ఇలా చేశారని, రాజకీయ దురుద్దేశంతో తన పర్యటనను అడ్డుకునేందుకు ఈ నోటీస్ ఇచ్చారని అన్నారు. అయితే, తన థానే పర్యటన మాత్రం ఆగదని స్పష్టం చేశారు. తనను ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటానని చెప్పారు. నోటీసుపై మహారాష్ట్ర న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News