: రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించింది వీరికే...!


పలు హత్య కేసుల్లో మరణశిక్ష పడిన ఆరుగురు దోషులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్ష తిరస్కరించిన సంగతి తెలిసిందే. హోంమంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. క్షమాభిక్ష తిరస్కరించిన వారి వివరాలు చూస్తే... ఇందులో మొదటిది వరస అత్యాచారాలు, హత్యల కేసులో నిందితుడైన సురేంద్ర కోలీ (ఉత్తరప్రదేశ్) కేసు. కోలీపై మొత్తం పదహారు కేసులు ఉన్నాయి. 2005-06 సంవత్సరాల్లో తాను పనిచేసే ఇంటి యాజమాని నివాసంలోనే పిల్లల్ని కోలీ దారుణంగా చంపేశాడు. దాంతో, దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అతనికి మరణశిక్ష విధించాయి. కొన్ని కేసుల్లో ఇంకా విచారణ జరుగుతోంది. నోయిడాలోని నిఠారి ప్రాంతంలో ఈ హత్యలు జరగడంతో నిఠారి హత్య కేసు అని దీనికి పేరొచ్చింది. 1990-96 మధ్య రేణుకాబాయ్, సీమా (మహారాష్ట్ర) అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు పదమూడు మంది పిల్లల్ని అపహరించి వారిలో తొమ్మిది మందిని చంపేశారు. మిగతావారి చేత దొంగతనాలు చేయించేవారు. పిల్లలు పెద్దయ్యాక ఎదురు ప్రశ్నించడంతో తలలు చితగ్గొట్టి, రైలు పట్టాలపై తోసేసి చంపేవారు. ఈ కేసులో అక్కాచెల్లెళ్లిద్దరికీ 2006లో సుప్రీం మరణశిక్ష విధించింది. మహారాష్ట్రకు చెందిన ఓ బాలికను లైంగికంగా వేధించి అతి క్రూరంగా హతమార్చిన కేసులో వాస్నిక్ కు, భార్యతో పాటు ఐదుగురు పిల్లల్ని చంపిన కేసులో జగదీష్ (మధ్యప్రదేశ్) లకు వేసిన మరణశిక్షపైనా రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించారు. మరొకటి ఇంటికి తాళం వేసి నిప్పంటించి ముగ్గురుని సజీవ దహనం చేసిన కేసులో మరణ శిక్ష పడిన బొర్డొలొయ్ (అస్సాం)కి కూడా క్షమాభిక్ష నిరాకరించారు.

  • Loading...

More Telugu News