: సింగరేణిలో కేంద్రం వాటాను కూడా కొందాం: కేసీఆర్


సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటాను కూడా కొందామని... దానికి గల అవకాశాలను పరిశీలించాలని అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ రోజు సింగరేణిపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి ప్రాంతంలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిద్దామని, అంతేకాకుండా ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేద్దామని చెప్పారు. ఈ సమావేశంలో రెండు థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సింగరేణి యాజమాన్యం అంగీకారం తెలిపింది. సింగరేణిలో సకల జనుల సమ్మె కాలాన్ని సెలవుగా ప్రకటించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News