: 'జీ3' స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన ఎల్ జీ
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్ జీ తన నూతన స్మార్ట్ ఫోన్ 'జీ3'ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మూడు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. 32 జీబీ మెమొరీ సామర్థ్యం గల మొబైల్ ధర రూ. 50,990 కాగా, 16 జీబీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ. 47,990. ఈ స్మార్ట్ ఫోన్లను ఈ రోజు ముంబైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సూన్క్ నో మాట్లాడుతూ, స్మార్ట్ ఫోన్ల విభాగంలో భారత మార్కెట్లో ఈ ఏడాది 10 శాతం వాటా సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు తెలిపారు. అంతేకాకుండా 'జీ3' ఫోన్లకు బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యవహరిస్తారని చెప్పారు.