: తెలంగాణ విద్యార్థులపై లాఠీఛార్జ్ జరగడం శోచనీయం: షబ్బీర్ అలీ


తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ విద్యార్థులపై లాఠీఛార్జ్ జరగడం దారుణమని కాంగ్రెస్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే తమ ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని... వారి ఆందోళన సబబేనని చెప్పారు. తమ హక్కుల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం చాలా తప్పని తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన విద్యార్థులను అగౌరవ పరిచేలా హోంమంత్రి నాయిని చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. విద్యార్థుల త్యాగాలతోనే సీఎం, హోంమంత్రి పదవులు అనుభవిస్తున్నారన్న సంగతి గుర్తుంచుకోవాలని షబ్బీర్ అలీ మండిపడ్డారు. విద్యుర్థులపై వెంటనే కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News