: మంచుముద్దలతో కేన్సర్‌నుంచి ఉపశమనం
మంచు గడ్డలతో వైద్యం అంటే ఏదో జ్వరంతో బాధపడుతున్నప్పుడు, కండరాల నొప్పితో బాధపడుతున్నప్పుడు.. మంచు గడ్డలను ఉపశమనంగా రాస్తే బాగుంటుందని మనం అనుకుంటాం. కానీ మంచు గడ్డలతో ఏకంగా కేన్సర్‌నుంచి కూడా ఉపశమనం కలిగించవచ్చునట. కేన్సర్ వలన పాడైన కణుతులను క్రయోబ్లేషన్ అనే ప్రక్రియ ద్వారా గడ్డ కట్టిన మంచుతో ధ్వంసం చేస్తూ మాయోక్లినిక్ పరిశోధకులు అనేక ప్రయోగాలు నిర్వహించారు. క్రయోబ్లేషన్‌తో పూర్తిగా నయం కాకపోవచ్చు గానీ.. కేన్సర్ మరింత ముదరకుండా అడ్డుకోవచ్చునని, జీవితం కొంత మెరుగ్గా ఉంటుందని రేడియాలజిస్ట్ డేవిడ్ ఉడ్రమ్ చెబుతున్నారు.