: శిథిలావస్థలో కపూర్ పూర్వీకుల ఇల్లు


పాకిస్థాన్ లోని పెషావర్ పట్టణంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్ కపూర్ పూర్వీకుల ఇల్లు శిథిల స్థితికి చేరింది. త్వరలోనే అది కూలిపోయే పరిస్థితిలో ఉందంటూ పాక్ పత్రిక డాన్ తెలిపింది. ఖిస్సాఖ్వాని బజార్ సమీపంలో ధక్కి ప్రాంతంలో కపూర్ పూర్వీకులు నివసించేవారని, ప్రస్తుతం ఈ భవనం కూలిపోవచ్చని పత్రిక ప్రతినిధి ప్రత్యక్షంగా పరిశీలించి ఓ కథనాన్ని ప్రచురించారు. మరోవైపు రాజ్ కపూర్ పేరిట మధ్యప్రదేశ్ లో రేవా నగరంలో ఓ ఆడిటోరియం నిర్మించనున్నారు. ఆయన జ్ఞాపకార్థం త్వరలోనే ప్రపంచస్థాయి ఆడిటోరియం నిర్మాణం చేపట్టనున్నట్లు మధ్యప్రదేశ్ పౌరసంబంధాల శాఖ మంత్రి ప్రకటించారు. రాజ్ కపూర్ మామ అప్పట్లో రేవా రేంజ్ ఐజీగా పనిచేసే వారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News