: రుణమాఫీపై తుది నివేదిక సమర్పించిన కోటయ్య కమిటీ
రైతు రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోటయ్య కమిటీ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. రుణమాఫీపై పూర్తి స్థాయి మార్గదర్శకాలతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక అందజేసింది. రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలను నివేదికలో పొందుపరిచారు. ఈ నివేదికను ఆర్బీఐకి పంపించడం ద్వారా... రుణమాఫీని ఎలా చేయనున్నారన్న అంశాన్ని రిజర్వ్ బ్యాంకుకు స్పష్టం చేయనున్నారు.