: శవాలను సైతం లూఠీ చేసిన ఉక్రెయిన్ తిరుగుబాటుదారులు


మలేసియా విమానం దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు మరో షాకింగ్ వార్త! అసలే తమ ఆప్తులు, కుటుంబ సభ్యులు చనిపోయారన్న బాధలో ఉన్న బాధితుల కుటుంబాలకు మరో వార్త శరాఘాతం అయింది. కనీసం చనిపోయిన మృతదేహాలను కూడా ఉక్రెయిన్ తిరుగుబాటుదారులు సరిగ్గా చూసుకోలేదు. టోరెంజ్ నగరానికి తరలించకముందు ఉక్రెయిన్ తిరుగబాటుదారులు మృతదేహాలను చూసుకున్న తీరు అంతర్జాతీయంగా ఆగ్రహానికి గురైంది. ఎమ్ హెచ్ 17 కూల్చివేత తర్వాత విమానం కూలిన ప్రాంతం చుట్టూ విపరీతంగా తాగిన ఉక్రెయిన్ తిరుగుబాటుదారులు కాపలా ఉన్నారు. మత్తులో ఉన్న తిరుగుబాటుదారులు శవాలను సైతం లూఠీ చేశారు. విలువైన వస్తువులు ఏమైనా దొరుకుతాయేమోనని శవాలను, వాటి చుట్టూ ఉన్న ప్రదేశాలను విపరీతంగా వెతికారు. ఎవరికి దొరికిన కాడికి...వారు ప్రయాణికుల వస్తువులను దోచుకున్నారు. అంతేకాదు మత్తులో శవాలను ఇష్టం వచ్చినట్టు ఈడ్చుతూ...ఉక్రెయిన్ తిరుగబాటుదారులు నానాహంగామా చేశారు. మృతదేహాల పట్ల ఉక్రెయిన్ ఉగ్రవాదులు ప్రవర్తించిన విధానాన్ని చూసి అంతర్జాతీయ సమాజం నివ్వెరపోయింది.

  • Loading...

More Telugu News