: లేక్ వ్యూ అతిథిగృహంలో ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన లేక్ వ్యూ అతిథిగృహంలో ఈ సమావేశం జరుగుతోంది. దాదాపు అందుబాటులో ఉన్న మంత్రులందరూ ఈ భేటీకి హాజరయ్యారు. రైతు రుణమాఫీ, ఐటీ, సౌర విద్యుత్ విధానాలు, ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తదితర అంశాలపై భేటీలో చర్చిస్తున్నారు.