: కేటీఆర్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు విద్యార్థుల యత్నం
కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ప్రకటించడం పట్ల విద్యార్థులు భగ్గుమంటున్నారు. కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరిస్తే, తమ ఉపాధి అవకాశాలకు గండిపడుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా వర్శిటీలో ఐటీ మంత్రి కేటీఆర్ అధికారిక కార్యక్రమానికి అడ్డుతగిలేందుకు విద్యార్థులు యత్నించారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగా పోలీసులు పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు.