: కోర్టుకు హాజరైన జగన్... విచారణ ఆగస్టు 11కు వాయిదా
అక్రమాస్తుల కేసులో వైఎస్సార్సీపీ అధినేత జగన్ నేడు నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో 10 చార్జిషీట్లలో చోటుచేసుకున్న నిందితులందరూ కోర్టులో హాజరైనట్టు తెలుస్తోంది. కాగా, విచారణను న్యాయస్థానం ఆగస్టు 11కు వాయిదా వేసింది.