: హైదరాబాదుకు వై-ఫై సౌకర్యం పట్ల నిపుణుల ఆందోళన


ఈ ఏడాది చివరినాటికి హైదరాబాదును వై-ఫై సిటీగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వై-ఫై కారణంగా నష్టాలు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలి ఆర్నెల్లు ఉచితంగా వై-ఫై సదుపాయం అందించాలన్న సర్కారు నిర్ణయం కొన్ని అవకతవకలకు దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో వినియోగదారుల ఐడెంటిటీని గుర్తించడం చాలా కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐటీ చట్టం ప్రకారం ఇంటర్నెట్ వినియోగించుకునే వ్యక్తుల లాగాన్, లాగాఫ్ వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని, ఉచిత వై-ఫై ద్వారా ఇలా చేయడం సాధ్యపడదని తెలిపారు. అంతేగాకుండా, ఈ విధానం ద్వారా డేటా చౌర్యం ఎక్కువగా జరుగుతోందని ఇంటర్ పోల్ సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు ఉదహరించారు.

  • Loading...

More Telugu News