: బోగీలను వదిలి కాచిగూడ చేరుకున్న 'సంపర్క్ క్రాంతి' రైలు ఇంజిన్
సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. ఈ రైలు ఇంజిన్ బోగీలను వదిలి కాచిగూడ చేరుకోగా, బోగీలు ఉప్పుగూడ వద్ద నిలిచిపోయాయి. దీంతో, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బోగీలను కాచిగూడ తరలించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.