: బ్లాక్ బాక్స్ లను త్వరలోనే మాస్కోకు పంపిస్తాం: ఉక్రెయిన్ తిరుగుబాటుదారులు


మలేసియా విమానం ఎమ్ ఎచ్ 17 బ్లాక్ బాక్స్ లను తాము శుక్రవారం సేకరించామని రష్యన్ అనుకూల ఉక్రెయిన్ తిరుగుబాటుదారులు ప్రకటించారు. పరిశీలన కోసం బ్లాక్ బాక్స్ లను త్వరలోనే మాస్కోకు పంపిస్తామని తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ మేరకు రష్యన్ న్యూస్ ఏజెన్సీ ఇంటర్ ఫాక్స్ కు తిరుగుబాటుదారులు సమాచారం అందించారు. అంతర్జాతీయ పరిశీలకులు వచ్చేవరకు శవాలను తమ దగ్గరే జాగ్రత్తగా భద్రపరుస్తామని ఉక్రెయిన్ తిరుగుబాటుదారులు తెలిపారు. శవాలు పాడవకుండా ఉండాలనే ఉద్దేశంతో వాటిని ఏసీ రైల్ వ్యాగన్లలో భద్రపరిచామని వారు తెలియజేశారు.

  • Loading...

More Telugu News