: సినీ ఫక్కీలో ఖైదీ కాల్చివేత


ఇటీవలి కాలంలో ఎన్నో దారుణాలు సినిమాల్లో చూపించిన సన్నివేశాలను తలపిస్తున్నాయి. తాజాగా ఇండోర్ లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం ఆసుపత్రి పాలైన ఓ ఖైదీని డాక్టర్ వేషధారణలో వచ్చిన ఓ వ్యక్తి అతి సమీపం నుంచి కాల్చి చంపాడు. స్థానిక ఎంవై ఆసుపత్రిలో ఈ వేకువజామున నాలుగింటికి ఓ డాక్టర్ దుస్తుల్లో ఉన్న దుండగుడు నేరుగా ఖైదీ ఉన్న వార్డులోకి ప్రవేశించాడు. ఖైదీ రక్షణ కోసం ఏర్పాటైన కానిస్టేబుల్ కళ్ళెదురుగానే కాల్పులు జరిపాడు. అనంతరం ఆ దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఖైదీ ప్రాణాలు విడిచాడు.

  • Loading...

More Telugu News