: టీవీ ఆర్టిస్టుల దీక్ష విరమణ
డబ్బింగ్ సీరియళ్ళ ప్రసారం నిలిపివేయని పలు చానళ్ళ వైఖరిని నిరసిస్తూ తెలుగు టీవీ నటులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను నేడు విరమించారు. సినీ నటుడు మురళీ మోహన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు టీవీ ఆర్టిస్టులకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సంఘీభావం తెలిపింది. మా అధ్యక్షుడి హోదాలో మురళీ మోహన్ బుల్లి తెర కళాకారులకు మద్దతు పలికారు. ఇక అనువాద ధారావాహికలతో పాటు డబ్బింగ్ సినిమాలను రద్దు చేసే విషయంపైనా నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.