: హైదరాబాదు లాల్ దర్వాజా బోనాల్లో నేడు 'రంగం'
హైదరాబాదు లాల్ దర్వాజా బోనాల్లో భాగంగా నేడు 'రంగం' నిర్వహించనున్నారు. స్వర్ణలత అనే మహిళ అమ్మవారి పేరిట భవిష్యత్తును వెల్లడిస్తుంది. ఈ కార్యక్రమాన్నే ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తారు. కాగా, బోనాల నేపథ్యంలో తెలంగాణ సర్కారు నేడు హైదరాబాదులోని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.