: మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా సింగ్లా నియామకం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా ఐఎఫ్ఎస్ అధికారి సంజీవ్ కుమార్ సింగ్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పోస్టులో పనిచేస్తున్న విక్రమ్ మిస్త్రీ, స్పెయిన్ లో భారత రాయబారిగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న 1997 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన సింగ్లా, గతంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి రంజన్ మతాయ్ వద్ద డైరెక్టర్ గా పని చేశారు. సింగ్లా నియామకం, మిస్త్రీ బదిలీలకు సంబంధించి కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది.