: ఒడిశాకు వరద ముప్పు
ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొరలుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వరద ముప్పు పొంచి ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం, అన్ని జిల్లాల అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రానున్న నాలుగైదు రోజులు కూడా రాష్ట్రంలో భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు వర్షపాతం నమోదు, జరుగుతున్న పరిణామాలపై సమాచారం సేకరిస్తోంది