: ప్రభుత్వ పనితీరుపై డేగకన్ను: ఏపీసీసీ చీఫ్ రఘువీరా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తమ పార్టీ డేగ కన్ను వేసిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. ఆదివారం గుంటూరులో జరిగిన పార్టీ నేతల సమావేశంలో పాల్గొన్న ఆయన, చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై విమర్శలు సంధించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రీషెడ్యూల్ లేని వ్యవసాయ రుణాలన్నిటినీ బేషరతుగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశాలతోనే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రకటనలు గుప్పిస్తున్నాయన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ల విడుదలకు సంబంధించి ఇరు రాష్ట్రాలు పోట్లాడుకునే రీతిలో వ్యవహరిస్తున్నాయని, ఈ క్రమంలో విద్యార్థులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.