: జగన్ పై కేసులు పెట్టేందుకు భారత చట్టాలు సరిపోవు: మంత్రి పుల్లారావు
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్పడ్డ అవినీతిపై కేసులు పెట్టాలంటే దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలు సరిపోవని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. 40 రోజుల్లోనే ప్రతిపక్ష నేతగా జగన్ ఘోరంగా విఫలమయ్యారని ఆదివారం మంత్రి ఆరోపించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు వ్యవసాయ, డ్వాక్రా రుణాలను తప్పనిసరిగా మాఫీ చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.