: విజయవాడ రైల్వే ఎస్పీ శ్యాంప్రసాద్ పై చీటింగ్ కేసు
విజయవాడ రైల్వే ఎస్పీ శ్యాంప్రసాద్ పై ఏలూరు మూడో పట్టణ పోలీసు స్టేషన్ లో ఆదివారం చీటింగ్ కేసు నమోదైంది. ఓ పరిశ్రమలో వాటాలు ఇప్పిస్తానని రూ. 25 లక్షలు తీసుకుని మోసం చేశారన్న మహిళ ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరవాసరం పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రాంబాబు భార్య, శ్యాంప్రసాద్ పై ఫిర్యాదు చేశారు. రాంబాబు గతంలో విజయవాడ రైల్వే పోలీసు స్టేషన్ లో పనిచేశారు.