: ఢిల్లీలో మళ్లీ ఎన్నికలకే సిద్ధం: బీజేపీ


ఢిల్లీలో తిరిగి ఎన్నికలకు వెళ్లేందుకే తాము సిద్ధంగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ అన్నారు. ఆదివారం కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, ఢిల్లీలో తమ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అయితే సర్కారు ఏర్పాటు చేయమని, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమను కోరితే, అప్పుడు ఆలోచిస్తామని చెప్పారు. సర్కారు ఏర్పాటు చేస్తామని తమకు తాముగా యత్నాలేవీ చేయడం లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ఢిల్లీలో సర్కారు ఏర్పాటు, కొత్తగా ఎన్నికలకు వెళ్లే విషయాలపై తమ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను రాజ్ నాథ్ కు వివరించానని సతీశ్ చెప్పారు.

  • Loading...

More Telugu News