: 'గులాబీ' ఆఫర్ పై కాంగ్రెస్ పరేషాన్!


రండి... రండి... దయచేయండంటూ ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విసిరిన ఓపెన్ ఆఫర్ అధికార పార్టీ కాంగ్రెస్ లో గుబులు రేపుతోంది. ఇప్పటికే పలువురు తెలంగాణ ప్రాంత సీనియర్ నేతలు కేసీఆర్ తో చర్చలు జరిపిన నేపథ్యంలో నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆయన నేటి సాయంత్రం మంత్రి జానా రెడ్డి, సీనియర్ నేత కె. కేశవరావుతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై వారితో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎంపీలెవరూ పార్టీని వీడరని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకే జానా తదితరులతో సమావేశమయ్యానని బొత్స వెల్లడించారు.

  • Loading...

More Telugu News