: జూన్ లో భారీగా తగ్గిన వర్షపాతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ నెలలో వర్షపాతం భారీగా తగ్గిపోయింది. సాధారణ వర్షపాతం కంటే 42 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో అతి తక్కువ వర్షపాతం నమోదైందని ఆ శాఖ డైరెక్టర్ సీతారామ్ ఆదివారం తెలిపారు. రాయలసీమలో ఇప్పటికే నమోదు కావాల్సిన వర్షపాతంలో 4 శాతం మేర లోటు ఏర్పడిందని, రానున్న రోజుల్లో ఈ లోటు మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని ఆయన వ్యాఖ్యానించారు. అల్పపీడనం వల్ల రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడం లేదని ఆయన తెలిపారు.