: టైపూన్ కారణంగా ఫిలిప్పీన్స్ లో 94 మంది మృతి


ఫిలిప్పీన్స్ ను టైపూన్ తుపాను ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న తుపాను కారణంగా ఆదివారం నాటికి 94 మంది చనిపోయినట్టు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. మరో ఆరుగురు గల్లంతయ్యారని తెలిపింది. ఓ తుపాను నిలిచిందో, లేదో మరో తుపాను ఫిలిప్పీన్స్ ను అతలాకుతలం చేసేసింది. ఈ నేపథ్యంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపానుల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సపఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం కుదరడం లేదు. అంతేకాక సహాయ చర్యలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆ దేశ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News