: ఎవరిని పడితే వారిని కారెక్కించుకోరట!


ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ తన ట్రేడ్ మార్కు దూకుడుతో ప్రత్యర్థుల్లో వణుకు పుట్టిస్తున్నారు. టీఆర్ఎస్ లోకి రండంటూ ఆయన ఇచ్చిన ఓపెన్ ఆఫర్ కు భారీ స్పందన రావడంతో టీడీపీ, కాంగ్రెస్ వర్గాల్లో గుబులు మొదలైంది. కేసీఆర్ తో చర్చలు సాగించే వాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా.. ఈ విలక్షణ పొలిటీషియన్ మాత్రం ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకోబోమని స్పష్టం చేస్తున్నారు. పార్టీతో పాటు ఉద్యమానికి ఉపయోగపడతారని భావిస్తేనే టీఆర్ఎస్ లోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని కేసీఆర్ కరాఖండీగా చెప్పారు. ఇంకా క్యూలో చాలామందే ఉన్నారంటూ ఆయా పార్టీల గుండెల్లో బాంబు పేల్చారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించిన అనంతరం కేసీఆర్ ఈ విషయాలు మీడియాతో చెప్పారు.

  • Loading...

More Telugu News