: కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతోంది?


తెలంగాణ ఉద్యమం లైవ్ లో లేకపోతే టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఏం చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ఎంచక్కా మెదక్ జిల్లాలో ఉన్న తన ఫామ్ హౌస్ కి వెళ్ళి అక్కడ హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి పేరిట ఆయన ఏం చేస్తారనేది పక్కనబెడితే, అజ్ఞాతం వీడారంటే మాత్రం తెలంగాణ రాజకీయాలు ఊపందుకోవాల్సిందే. ఇప్పుడూ అదే జరుగుతోంది.

ఆపరేషన్ ఆకర్ష అంటూ ఆయన విసురుతున్న వలలకు టీడీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా చిక్కుకుంటున్నారు. నిన్న మందా జగన్నాథం, నేడు గంగుల కమలాకర్! పార్టీలు వేరైనా, గమ్యం ఒక్కటే అన్నట్టు అందరూ కారెక్కేందుకు పోటీ పడుతున్నారు! మందా మధ్యవర్తుల సాయంతో చర్చలు జరిపితే, గంగుల ఏకంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కే వెళ్ళి అక్కడ మంతనాలు సాగించారు. అనంతరం టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. దీన్నిబట్టి ఈ సాయంత్రం గంగులను పార్టీ వీడకుండా నిలువరించేందుకు టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు విఫలమైనట్టు తెలుస్తోంది! .

  • Loading...

More Telugu News